
విద్యార్థిని విద్యార్థులు చిన్ననాటి నుంచి కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని పట్టణ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బస్వా రెడ్డి అన్నారు. పట్టణంలోని క్షత్రియ యువజన సమాజ్ ఆధ్వర్యంలో క్షత్రియ పేద విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలను పంపిణీ. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్షత్రియ యువజన కార్యవర్గం సభ్యులు, పెద్దలు మాట్లాడుతూ క్షత్రియ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని శ్రద్ధగా చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ నాయకులు కాందేశ్ శ్రీనివాస్ ,పండిత్ ప్రేమ్ ,గంగా మోహన్ తదితరులు పాల్గొన్నారు.