ఏసీపీని సన్మానించిన సామాజిక సేవకుడు

నవతెలంగాణ – ఆర్మూర్   

పట్టణానికి నూతన ఏ.సీ.పీ.గా పదవి బాధ్యతలు చేపట్టిన బస్వారెడ్డిని బుధవారం వారి కార్యాలయంలో  పట్టణ సామాజిక సేవకులు  పట్వారీ తులసి కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కను, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో మీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, రక్షణగా నిలవాలని పట్వారి తులసి కోరారు. పట్వారి సంఘ సేవకు ఎల్లప్పుడు సహయ సహకారాలు అందిస్తారని ఎసిపి బస్వారెడ్డి  అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.