నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను ఇటీవల ఆర్మూర్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన గట్టు బస్వారెడ్డి సోమవారం సాయంత్రం సందర్శించి, పరిశీలించారు. సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసుల వివరాలను ఎస్ఐ రాజశేఖర్ ను అడిగి తెలుసుకున్నాను. రికార్డులను పరిశీలించి, పలు సూచనలు చేశారు.