ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల పనితీరు మార్చుకోవాలి: ఏసిపి కిషోర్ కుమార్

Performance of government school teachers should be changed: ACP Kishore Kumarనవతెలంగాణ – ఆత్మకూరు
ప్రభుత్వ ఉపాధ్యాయుల పనితీరును మార్చుకోవాలని పరకాల ఏసిపి కిషోర్ కుమార్ సూచించారు. శనివారం ఆత్మకూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్స పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మల కుమారి అధ్యక్షతన జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరకాల తాలూకా జడ్జి శాలిని లింగం హాజరయ్యారు. సమావేశంలో ఎసిపి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక శక్తిని బయటికి తీయాలి అన్నారు. బెల్లు,బిల్లు అనే పద్ధతిని విడనాడి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి వారి భవిష్యత్తుకు పునాదులు వెయ్యలన్నారు. విద్యార్థులు హాజరు శాతం తగ్గడానికి ప్రభుత్వ ఉపాధ్యాయుల కారణమన్నారు. ఉపాధ్యాయులు తము కూర్చున్న కొమ్మను తానే నరికేసుకునె స్థాయికి వచ్చారని అన్నారు. ఉపాధ్యాయుల పైన విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా వ్యవహరించాలన్నారు. తరగతి గదుల్లోనే సమాజానికి పునాదులు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో  విద్యార్థుల శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులకు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐ సంతోష్ కుమార్ న్యాయవాదులు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.