రక్తదానం చేయడం, మరొకరి ప్రాణాలకు పునర్జన్మ ఇవ్వడమేనని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పెర్కిట్ ఎం ఆర్ గార్డెన్ యందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి విధి నిర్వహణలో అమరులైన పోలీసులను గుర్తు చేసుకుంటూ, వారి బాటలో నడుస్తూ వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ప్రపంచంలోనే ఇండియాలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నావని వారికి అత్యవసరంగా రక్తం అవసరం ఉంటుందని రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవికుమార్ మాట్లాడుతూ.. రక్తదానం చేయడంవల్ల ఆపదలో ఉన్న మరొకరి ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వారిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్, బాల్కొండ సిఐలు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్న ,కౌన్సిలర్ కొంతం మురళి ,పోలీస్ అధికారులు పాల్గొన్నారు.