ఆయిల్‌ పామ్‌ మిల్లుల నిర్మాణానికి స్థలాలు సేకరించండి

– అధికారులకు ఉద్యానశాఖ డైరెక్టర్‌ అశోక్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అన్ని కంపెనీలు ప్యాక్టరీ జోన్లలో ఆయిల్‌ పామ్‌ మిల్లుల నిర్మాణం కోసం స్థలాలు సేకరించాలని ఉద్యాన శాఖ డైరెక్టర్‌ అశోక్‌రెడ్డి ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి జిల్లా ఉద్యాన అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆయిల్‌ పామ్‌ సాగుపై రైతులకు అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. ఆయిల్‌ పామ్‌ కొత్త పంట కావడంతో రైతులకు ఎప్పటికప్పుడు తగిన సాంకేతిక సహాయ, సహకారాలను అందించాలని కోరారు. 2024-25లో ఆయిల్‌ పామ్‌ సాగు ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. ఆయిల్‌ పామ్‌ నర్సరీలను నిరంతరం పర్యవేక్షించి, రైతులకు నాణ్యమైన మొక్కలు మాత్రమే అందించాలన్నారు.