కృష్ణ వంశీ, మోక్ష లీడ్ రోల్స్‌లో నటించిన లవ్ ఎంటర్‌టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మోక్ష సోమవారం మీడియాతో ముచ్చటించింది. ‘తెలుగులో నా మొదటి సినిమా ‘లక్కీ లక్ష్మణ్’. ఇది నా రెండో సినిమా. ఇందులో నా క్యారెక్టర్ పేరు ధరణి. ఇదొక కమర్షియల్ పొయిటిక్ మూవీ. నా క్యారెక్టర్ చాలా హైపర్, అల్లరిగా ఉంటుంది. చాలా బ్యూటీఫుల్ క్యారెక్టరైజేషన్, ప్రతి అమ్మాయి రిలేట్ చేసుకునేలా ఉంటుంది. ఈ సినిమాలో నాకు చాలా మంచి డైలాగులు ఉన్నాయి. హీరో కృష్ణ వంశీ పెర్ఫర్మెన్స్ చాలా నేచురల్‌గా ఉంటుంది. ఇందులో తనది స్వార్ధం లేని ప్రేమ. ప్రజెంట్ జనరేషన్‌లో శ్రీరాముని క్యారెక్టర్‌తో హీరో క్యారెక్టర్‌ని కోరిలేట్ చేసుకునేలా ఉంటుంది. ఇదొక క్లాసిక్ యూనివర్సల్ లవ్ స్టొరీ. ప్రస్తుతం ‘రామం రాఘవం’తో తెలుగు సినిమాతోపాటు ఒక మలయాళం సినిమా విడుదలకు రెడీ అవుతుంది’.