‘తీవ్రవాద చర్య’

దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత విమర్శ
సియోల్‌ : కలుషితమైన అణు ధార్మిక వ్యర్ధ జలాలను పసిఫిక్‌ మహా సముద్రంలోకి విడిచిపెట్టడాన్ని ‘తీవ్రవాద చర్య’ గా దక్షిణ కొరియా ప్రధాన ప్రతిపక్ష పార్టీ చీఫ్‌ లీ జే ముయాంగ్‌ వ్యాఖ్యానించారు. ‘ఈ సామ్రాజ్యవాద దురహంకార చర్యతో పొరుగు దేశాల్లోని ప్రజల జీవిత హక్కుకు జపాన్‌ ముప్పు కలిగిస్తోంది. తద్వారా దక్షిణ కొరియాకు, పసిఫిక్‌ మహా సముద్ర దేశాలకు మరో కోలుకోలేని ముప్పును తీసుకురాబోతున్నారు.” అని పార్టీ సమావేశంలో లీ పేర్కొన్నారు. జపాన్‌ ఇలా అణు వ్యర్ధ జలాలను వదలడం రెండో పసిఫిక్‌ యుద్ధంగా చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. జపాన్‌ తీసుకున్న ఈ చర్యతో దక్షిణ కొరియా మత్స్య పరిశ్రమ మొత్తంగా కుప్పకూలుతుందని లీ హెచ్చరించారు. ఈ చర్యపై తాము పోరాటం జరపనున్నట్లు ప్రకటించారు.