ఊరూరా చెరువులు పండుగ పై కార్యాచరణ సమావేశం

నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ అవతరణ పురస్కరించుకుని ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఊరూరా చెరువులు పండుగను విజయవంతం చేయాలని ఎం.పి.డి.ఒ శ్రీనివాస్ సర్పంచ్ లకు,కార్యదర్శులకు దిశానిర్దేశం చేసారు. ముందస్తుగా ఒక్కో పంచాయితీకి రూ.25 వేలు వ్యయం చేస్తామని, మిగతా వి కార్యక్రమం అనంతరం చెల్లిస్తామని అన్నారు. ఊరూరా చెరువులు పండుగ విజయవంతం కోరుతూ బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్ లు,కార్యదర్శుల సంయుక్త సమావేశం నిర్వహించారు. మండల వ్యాప్తంగా 30 చెరువులు వద్ద జరిగే ఉత్సవాల్లో 15 వేలు మంది పాల్గొనే అవకాశం ఉందని ఒక అంచనాకు వచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు ఐడి డీఈ ఎల్.క్రిష్ణ,ఎస్.ఆర్.పి ఎ.ఇ శ్రీ కుమార్,ఎం.పి.ఇ.ఒ సీతారామ రాజు, ఈజీఎస్ ఎ.పి.ఒ నరేష్ లు పాల్గొన్నారు.