
నవతెలంగాణ – కంటేశ్వర్
జేఎన్టీయూ ఎస్ఎఫ్ఐ నాయకుడు కార్తీక్ పై దాడి చేసిన ఏబీవీపీ గుండాలపై చర్యలు తీసుకోవాలని జేఎన్టీయూ బీసీని వెంటనే తొలగించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిన్న జేఎన్టీయూ లో ఎస్ఎఫ్ఐ నాయకుడు పై దాడి చేసిన ఏబీవీపీ గుండాలను డిబార్ చేయాలని దిష్టిబొమ్మ దగ్ధం స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ జేఎన్టీయూ లో విద్యారంగ సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేస్తూ జెఎన్టియు విసి అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ, అడ్డుకుంటూ విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ పనిని ఓర్వలేని ఏబీవీపీ నాయకులు నిన్న మేడ్చల్ జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్ పై అమానుషంగా దాడి చేసి కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అదేవిధంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయని వారు, అక్రమాలకు పాల్పడుతున్న వీసీని కాపాడుతున్న ఏబీవీపీ నాయకులు ఏ విధంగా విద్యార్థి సంఘ అవుతారని ప్రశ్నించారు.అలాగే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మతం,కులం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఎల్ కెజి నుండి పీజీ వరకు విద్యారంగ సమస్యలపై పోరాటం చేస్తుందని అన్నారు. అదేవిధంగా చేతనైతే విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేయాలని ఏబీవీపీ నాయకులకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నామని అన్నారు. అదేవిధంగా దాడులు చేసినంత మాత్రాన సమస్యల పరిష్కారం కోసం, తప్పును ప్రశ్నించడం కోసం వెనుకడుగు వెయ్యకుండా మరిన్ని ఉద్యమాలు చేస్తామని, ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకుడు పై దాడి చేసిన ఏబీవీపీ నాయకులను డిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు వేణు గణేష్ సందీప్ మరియు ఎస్ఎఫ్ఐ నగర నాయకులు మారుతి ఆజాద్ కిరణ్ సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు.