బాల్క సుమన్ పై చర్యలు తీసుకోవాలి..

నవతెలంగాణ-జక్రాన్ పల్లి 

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వాక్యాలు చేసిన చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై చర్యలు తీసుకోవాలని జక్రాన్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ లో మంగళవారం పిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో దొరల పరిపాలన చేసిన కేసీఆర్ దగ్గర బానిసగా బతికిన దళిత ద్రోహి బాల్క సుమన్ తెలంగాణలో ప్రజా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. తక్షణమే బాల్క సుమన్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, నాయకులు కుడాల గంగారాం, సైకిల్ అక్బర్, దేవరాజుల గంగాధర్, నియామత్ అలీ, బాలయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.