నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలో గల షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా నడుస్తున్న బ్లూ బైల్స్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం అఖిల భారత పరీక్షల విద్యార్థి సంఘం (ఏఐపిఎస్యు) ఆధ్వర్యంలో ఈరోజు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలోనే జూనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జ్వాల మాట్లాడుతూ.. బ్లూ బెల్స్ పాఠశాల యాజమాన్యం ఒకచోటి నుంచి మరోచోటికి పాఠశాలను మార్చి పాఠశాల నిర్వహించడం జరుగుతుందని దానికి సంబంధించిన సెట్టింగ్ అనుమతులు కనీసం లేకుండా భవనంలో ఫెసిలిటీస్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తుంగలో తొక్కుతూ ఇష్టం వచ్చిన రీతలో పాఠశాల నిర్వహణ చేస్తున్న బ్లూ బెల్స్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరుతున్నాం లేనటువంటి పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆంధ్ర కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నo అని తెలిపారు.