రోడ్లపై సంచరిస్తున్న పశువులపై చర్యలు తీసుకోవాలి…

నవతెలంగాణ – మంథని
పట్టణంలోని ప్రధాన రహదారిలో అధిక సంఖ్యలో పశువులు సంచరిస్తూ వచ్చి పోయే ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని పేర్కొంటూ గురువారం మంథని మునిసిపల్ కమిషనర్ గట్టు మల్లికార్జున స్వామికి బెజ్జంకి డిగంబర్ వినతిపత్రం అందజేశారు. పట్టణంలో ప్రతి రోజు సాయంత్రం వేళ మెయిన్ రోడ్ లో పశువులు రోడ్లపై సంచరిస్తూ ఉండడంతో వచ్చి పోయే వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయని, పశువుల ప్రాణాల కంటే మనుషుల ప్రాణాలు ముఖ్యమని పేర్కొంటూ పశువులను బంజరు దొడ్డిలోకి పంపించాలని ఆయన వినతిపత్రం సమర్పించారు.