– ఏఎఫ్‌డీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మల్లె మురళి
నవతెలంగాణ-మియాపూర్
దీక్ష సుమన్ కాలేజ్ పై తీసుకోవాలని ఏఐఎఫ్‌టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మురళీ అన్నారు. మహిళా దక్షిత సమితి సుమన్ నర్సింగ్ కాలేజీలో గత ఆదివారం తీసుకున్న ఆహారంతో 50 మంది విద్యార్థులు అస్వస్థకు గురై స్థాని కంగా ఉన్న అర్చన హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొనీ. ఎణ ఎప్‌డీ ఎస్.రాష్ట్ర అధ్యక్షులు పల్లెమురళి హాస్పిటల్ వెళ్లి విద్యార్థులను పరామర్శిం చారు. హాస్పిటల్ సిబ్బంది తెలిపిన సమాచారం మేరకు మొత్తం 50 మంది విద్యార్థులు ఆస్పత్రి చికిత్స కోసం రాగా సుమారు 20 మందికి పైగా నయమైందని ఇంకా 18 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ..కాలేజీ యాజమాన్యం నీటి కాలుష్యం వల్ల అస్వస్థతకు గురయ్యారని మాట దా టేస్తున్నారు. నీటి కాలుష్యమైతే మొత్తం ప్రాంతంలో ఉన్న ప్రజలు అస్వస్థకు గురికావాలి కానీ విడ్డూరంగా ఒక కాలే జీలో ఉన్న పిల్లలు మాత్రమే ఫుడ్ పాయిజన్ కావడమేం టీ అని ప్రశ్నించారు. ఇది పూర్తిగా కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం. సరైన ఆహారం వారికి ఇవ్వక ఇలాంటి పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికా రులు ఈ హాస్టల్స్‌లో పెడుతున్నటువంటి ఆహార పదార్థా లపై ఎలాంటి తనిఖీలూ చేయడం లేదన్నారు. వారు నామమాత్రంగా ఈ జిల్లాలో జీతాలు తీసుకుంటున్నారు తప్ప ఏ ఒక్క హాస్టల్‌కు వెళ్లి తనిఖీలు చేయడం గానీ కనీస ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించకపోవడం వలన ఇలాం టి పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. కాలేజ్ స్టార్ట్ అయిన మొదట్లోనే మొన్న మాదాపూర్ చైతన్య కాలేజ్‌లో నిన్న చందానగర్ సుమన్ కాలేజీలో విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. ఇకనైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిద్రవీడి తనిఖీలు చేసి ఆయా కాలేజీలోలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.