నవతెలంగాణ – భువనగిరి
ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలి, రెగ్యులర్ పాఠశాలకు హాజరు గాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ లావుడీయరాజు డిమాండ్ చేశారు. గురువారం భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు చింతల శివ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న ప్రభుత్వ విద్యా రంగాన్ని నిరుకారించే పరిస్థితి ఏర్పడిందన్నారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులే ఇంటికాడ ఉండి నెలకు రెగ్యులర్గా జీతాలు తీసుకుంటూ విద్యార్థులను చదువుకు దూరం చేసే పరిస్థితి మన యాదాద్రి భువనగిరి జిల్లాలో చూస్తూ ఉన్నామన్నారు. ఏదైతే నిన్న 16 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడానికి ఎస్ఎఫ్ఐ స్వాగతిస్తున్నాం డిఓకి అభినందలు తెలియజేస్తూన్నామన్నారు. జిల్లాలో అనేక పాఠశాలలో ఇలాంటి ఘటనలే ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ గా యాత్ర చేసినప్పుడు అనేక పాఠశాలలో విద్యార్థులు ఉన్నాగాని ఉపాధ్యాయులు రాని పరిస్థితి ఉన్నదన్నారు. రెగ్యులర్గా పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలన్నారు. జిల్లాలో మారుమూల గ్రామాల్లో పాఠశాలలో నెలకు తరబడి పాఠశాలకు హాజరు కాకుండా ఉన్నటువంటి పాఠశాల పై చర్యలు తీసుకోవాలన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, విద్యార్థిలకు చదువుకు ఆటంకం కలగకుండా విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. విద్యార్థులకు చదువులు చెప్పకుండా రెగ్యులర్గా నెలకు జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) గా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, బుగ్గ ఉదయ్, మైసూల నరేందర్, పుట్టల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.