సర్టిఫికెట్లు ఇవ్వని హిట్స్‌ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

– ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాలు
నవతెలంగాణ-వికారాబాద్‌ రూరల్‌
వికారాబాద్‌ జిల్లాలో ఉన్న హిట్స్‌ బీఈడీ, డైట్‌ కళాశా లలో చదువుకున్నా విద్యార్థులకు విద్యాసంవత్సరం పూ ర్తయి సంవత్సరం గడుస్తున్నా విద్యార్థులు తమ ఒరిజినల్‌ స్టడీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కళాశాల యాజమాన్యాన్ని చాలా రోజులుగా అడుగుతున్నా ఈ రోజు, రేపు అంటూ చెప్ప ట మే కాని ఇవ్వటం లేదన్నారు. ఫీజులు వసూలు చేసిన యా జమాన్యం విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా రు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు కళాశాల గేటు ఎదట ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ ఎస్‌యూఐ విద్యార్థి సంఘాల నాయకుల తో కలిసి ధర్నా నిర్వహించారు. కళాశాల ఇన్‌ స్పెక్షన్‌ కోసం వచ్చిన అధికారులు విద్యార్థుల ఆందోళనను చూసి విద్యా ర్థుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో విద్యా ర్థులు ఆందోళనను విరమించారు. ఒకవేళ అధికారులు మాట కూడా అమలు కాకుంటే విద్యార్థులకు న్యాయం జరి గే వరకూ పోరాటం కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.