నవతెలంగాణ-పరిగి
ఐఏఎస్ స్మిత సభర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్‌పీఆరడీ జిల్లా అధ్యక్షుడు జే. దశరథ్ అన్నారు. వికలాం గులను అవమానించిన స్మిత సభర్వాల్‌కు ఐఏఎస్‌గా కొనసాగే హక్కు లేదని సోమవారం పరిగి పట్టణ కేంద్రంలో వికలాంగుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయాలని ప్రకటించే హక్కు స్మిత సభర్వాల్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రతిభ ఎవ్వరి సొత్తు కాదు వికలాంగుల ప్రతిభ ముందు స్మిత సభర్వాల్ ప్రతిభ ఎంత అన్నారు. వికలాంగులకు క్షమాపణ చెప్పే వరకు ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు ఆర్ అనంతలక్ష్మి, మండల కమిటీ సభ్యులు యాదయ్య, కే కవిత, కాసిం, గౌసియా, సోనీ బారు, చంద్రమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.