నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన బూర్ల వెంకటేశం ఇంటి నిర్మాణంపై పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని భిక్కనూరు మండల ఫోటో & వీడియో గ్రాఫర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బిక్షపతి తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో ప్రముఖ ప్రైవేట్ పాఠశాలను నిర్వహిస్తూ వెంకటేశం కుమారుడు అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి నిబంధనలు తుంగలో తొక్కి ఇంటిని నిర్మించడం సరికాదని అధికారులు ఇంటి నిర్మాణం పై చర్యలు తీసుకొని ఫోటో, వీడియో గ్రాఫర్ సభ్యుడు శ్రావణ్ కుమార్ కు న్యాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లింబాద్రి, ప్రధాన కార్యదర్శి సమీర్, భిక్నూర్ మండల ఫోటో వీడియో గ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.