నవతెలంగాణ-దేవరుప్పుల
విద్యారంగానికి బడ్జెట్‌లో నిధుల కేటా యింపులో అన్యాయం జరిగిందని రోడ్డు పై బైఠాయించి ధర్నాచేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దడిగే సందీప్, ధర్మ భిక్షంలపై జనగామ ఎస్‌ఐ శ్వేతా కక్ష్య పూరితంగానే కేసులు నమోదు చేశారని జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు సుమా గౌడ్ ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్దంగా విద్యార్థులకు బడ్జెట్ కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని నిరసన తెలుపుతూ ఉంటే పోలీసులు కేసులు నమోదు చేసి విధ్యార్ధి సంఘ నాయకులను భయ బ్రంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నిరసన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా,స్థానిక ఎస్‌ఎచ్‌ఓకు ముందస్తు సమాచారం రెండు సార్లు అందించామని,అయిన అధికార పార్టీ రాజకీయ నాయకుల ఒత్తిడి వలన కేసు నమోదు చేశారని మండిపడ్డారు. విద్యార్థి హక్కుల కోసం పోరాటం చేస్తే కాంగ్రెస్ ప్రజా పాలనలో కేసులు నమోదు అవుతున్నాయని ప్రభుత్వం పై ధ్వజం ఎత్తారు. వెంటనే కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.లేని యెడల రాబోయే రోజుల్లో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కార్యాచరణ ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంలో దీక్ష మరియు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ చేపడుతామని తెలిపారు.