ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి

– ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 
ఫీజుల నియంత్రణలో నిబంధనలు పాటించకుండా ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్న ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి డిమాండ్ చేశారు శనివారం హుస్నాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత విద్య అందించాలని అన్నారు. సిద్ధిపేట జిల్లాలో అనేక ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అనేక కార్పొరేట్ పాఠశాలల్లో యదేచ్ఛగా ఫీజులు వసూళ్లు చేస్తూ, తల్లిదండ్రులను పీడిస్తూ పాఠశాలలు నడుపుతున్నారని అన్నారు. యూనిఫారం,షూస్ ,టై,బుక్స్,స్పోర్ట్స్ డ్ర‌స్ తదితర మెటీరియల్ తమ పాఠశాలలోనే తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నారని, బుక్స్, యూనిఫాం పేరుతో వేల రూపాయలు ఫీజులు వసూళ్లు చేస్తున్న జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఫీజులు నియంత్రించకపోతే పాఠశాలల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు  అరవింద్, దాసరి ప్రశాంత్, సహాయ కార్యదర్శి నాచారం శేఖర్, నాయకులు రిషి, సాయి దీక్షిత్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.