డబ్బులు మాయం చేస్తున్న ప్రయివేటు హాస్పిటలపై చర్యలు తీసుకోవాలి

నవతెలంగాణ- ఆర్మూర్  

లేని జబ్బులు చుయించి.. ఉన్న డబ్బులను మాయం చేస్తున్న  ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాల పై చర్యలు తీసుకోవాలని వైద్యాన్ని 100% జాతీయం చేయాలని బివిఎం కార్డు రాష్ట్ర అధ్యక్షులు బట్టు శ్రీధర్  మంగళవారం చేశారు.  పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో గల ఒక హాస్పిటల్ యాజమాన్యం వైద్యులు .. పేషెంట్లకు తప్పుడు లాబ్ రిపోర్టులను ఇస్తూ వారిని అడ్మిట్ చేసుకొని  వేలల్లో లక్షల్లో వసూళ్లకు పాల్పడుతూ… రియల్ ఎస్టేట్ వ్యాపారంగ అవతారం ఎత్తిన వైద్యులు… అదే పేషెంట్ వేరే ఆసుపత్రికి వెళ్లగా ఎలాంటి రోగం లేదని నిర్ధారించడంతో… బయటపడ్డ బండారం. డబ్బులు దండుకునడంలో దండకం సదివిన వైద్యులు అని అన్నారు…కాయ్ రాజా కాయ్ .. నీకు సగం నాకు సగం ఆర్ఎంపి ఎంబీబీఎస్ ల బేరసారాల….అమాయకుల ప్రాణాలు పణంగా పెట్టి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నా ఆసుపత్రుల యాజమాన్యాలు.. పట్టణంలోని పెర్కిట్ రోడ్డులో గల ఒక ఆసుత్రి వైద్యులు యాజమాన్యం గ్రామాల్లో ఉండే ఆర్.ఎం.పి, పి ఎం పి లతో బేరం కుదుర్చుకొని కూలికి నాలికి వెళ్లి కాయ కష్టం చేసి రూపాయి రూపాయి పోగు చేసి దాచిన నిరుపేద ప్రజల ధనాన్ని… మానసిక స్థైర్యాన్ని అతులకుతులం చేసి… వారి జీవితలతో చెలగాటం ఆడుతున్నారు. అని ఆందోళన వ్యక్తం చేసినారు. ఇదేంటి అని ప్రశ్నించగా మెడికల్ బిల్లు, ఆపరేషన్ బిల్లు, నర్సింగ్ బిల్లు అంటూ ఇష్టానుసారంగా   కాయ్ రాజా కాయ్ అనే రీతిలో డబ్బులు వసూలు చేసి… నీకు 50% నాకు 50% అంటూ వసూళ్లకు ఎగబడుతు వైద్యాన్ని దందాగ మార్చిన వైనం .. తిరగబడి అడిగితే  పై అధికారులు పోలీసులు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేస్తామంటే.. వాళ్లంతా మావాళ్లే అని .. మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని కండ కావురంతో సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. ఓపెనింగ్ వచ్చిన ప్రజాప్రతినిధుల, అధికారులు… సందర్శిన చేయకపోవడం వేనుకున్న కారణాలు.. బంధాలు ఎంటి..? ఇంత దారుణానికి ఒడిగడుతున్న యాజమాన్యాల పై చర్యలు లేవా..? అని ప్రశ్నించారు.కనిపించే దేవుడిగా కొలిచే వైద్యులను.. నేడు సాధారణ ప్రజల రక్తం తాగే దోపిడీ దారులుగా చూస్తున్న ప్రజలు.. మా గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న ప్రజలు. ఈ స్థితిగతుల పై విచారణ చేపట్టాలని అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న భారతీయ విద్యార్థి మోర్చా(BVM) రాష్ట్ర అద్యక్షులు శ్రీధర్ బట్టు.. రాష్ట్ర నాయకులు జిల్లా అద్యక్షులు రాహుల్, తదితరులు పాల్గొన్నారు..