– కేవీపీస్
నవతెలంగాణ- హలియా: మండల కేంద్రమైన హాలియా, తిరుమలగిరి సాగర్ డొక్కల బాయి తండా లో భారతీయ సార్వత్రిక విద్యాలయం లో ప్రైవేట్ పాఠశాలలో చట్ట విరుద్ధంగా మతపరమైన, చాందసవాద శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని ఆ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని సోమవారం జిల్లా విద్యాధికారి కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శీను మాట్లాడుతూ విద్యాసంస్థల్లో విద్యాబోధన మాత్రమే చేయాల్సి ఉండగా చట్ట విరుద్ధంగా హాలియా, డొక్కల బాయి తండా లోని భారతీయ సార్వత్రిక విద్యాలయం పాఠశాలలో బలవంతంగా విద్యార్థులపై ఛాందస వాద భావాలు నూరిపోస్తున్నారని, పాఠ్యాంశాలకు సంబంధం లేని ఆర్ఎస్ఎస్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారని అన్నారు. పాఠశాలలో వినాయకుని విగ్రహాలు, దుర్గామాత విగ్రహాలు పెట్టి నవరాత్రి పూజలు చేస్తున్నారని ఆయన అన్నారు. భారత రాజ్యాంగాన్ని, స్వతంత్ర పోరాటాన్ని, సమరయోధులను మరిపిస్తూ, శాస్త్రీయత విద్యావిదానం, మతసామరస్యం నికి బదులుగా హిందుత్వ భావజాలాన్ని, మూఢనమ్మకాలను బాల్యంలో విద్యార్థుల మెదడులో చొప్పించే కుట్ర లో భాగంగా పాఠశాలలను కేంద్రాలు గా చేసుకున్నారని ఆయన అన్నారు. పాఠశాలలో అన్ని మతాల వారు ఉంటారని, మత సామ రస్యానికి విరుద్ధంగా పాఠశాలలో ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన శిక్షణ తరగతులు జరపడం సరైంది కాదని, పాఠశాల ప్రారంభంలో విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేసి, రంగురంగుల కరపత్రాలతో ఆకర్షించి, అడ్మిషన్ చేయించుకొని ఇప్పుడు యూనిఫామ్, షూ, బెల్ట్, బుక్స్, వ్యాన్, రకరకాలుగా అధిక ఫీజులు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని, అధిక ఫీజులు కట్టలేక చదువులు మధ్యలోనే మానేస్తున్నారని, కాలం కాక అధిక ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు, తక్కువ జీతానికి అర్హత లేని ఇంటర్ పూర్తి చేసిన వారిని, ఇంటర్ ఫెయిల్ అయిన టీచర్స్ తో పాఠశాల లు నడిపిస్తున్నారు. దళిత, గిరిజన విద్యార్థులను ఐదవ తరగతికి గురుకుల ప్రవేశాల కొరకు కోచింగ్ పేరుతో 25 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని, గురుకుల పాఠశాలలో సీటు ఇప్పించే బాధ్యత మాదేనంటూ దళిత, గిరిజన అమాయక తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేసి సొమ్ము చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఏదేచ్ఛగా ఇటువంటి దోపిడీలకు పాల్పడుతున్న పాఠశాల యాజమాన్యంతో కుమ్మక్కై మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు లు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, ఫీజులు రాబట్టుకోవడానికి విద్యార్థులను,తల్లిదండ్రులను అందరి ముందే హేళనగా మాట్లాడి మానసికంగా హింసిస్తూ, విద్యా వ్యాపారం చేస్తున్న భారతీయ సార్వత్రిక విద్యాలయం పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపును రద్దుచేసి యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని, కెవిపిఎస్ ఆ ధ్వ ర్యంలో ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.