నవతెలంగాణ – ఆర్మూర్
విద్య పేరుతో వ్యాపారం చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ నవ నిర్మాణ విద్యార్థి సేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్ అన్నారు. మండల విద్యాధికారి రాజగంగారం కు మంగళవారం మెమోరాండం అందజేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ప్రయివేటు విద్య సంస్థలు విచ్చల విడిగా యదేచ్చగా ఇష్టానుసారంగా నడుస్తున్నాయి ఇష్టానుసారంగా ఫీజులు రోజుకో డేలా పేరిట విద్యార్థులపై యాక్టివిటీస్ కోసం డబ్బులు వసూళ్లు ఒలంపియడ్ అని ఎస్ట్ర టెస్ట్ అని రోజుకో కలర్ డ్రెస్ కోడ్ అని వయస్సుకు మించి బుక్స్ భారం మోపుతూ అధిక ఎగ్జామ్ ఫీజులు వసూలు చేస్తూన్నాయి అని అన్నారు. ఎలాగైనా రోజుకొక విధంగా విద్యారుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఆటలకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా అసలు ప్రభుత్వ నియమాల ప్రకారం ఉండాల్సిన నియమాలతో లేకుండా విచ్చల విడిగా ఒక దగ్గర స్కూల్ పర్మిషన్ తీసుకుని మరో దగ్గర నడుపుతూ ఒక పెరు తో పర్మిషన్ తీసుకొని వేరే పేరు తో స్కూల్ నడిపిస్తూ కమర్షియల్ కాంప్లెక్స్ లో స్కూల్ నడిపిస్తూ అర్హత లేని వారిని అర కోర జీతాలతో టీచర్లను నియమించుకుని తప్పుడు మార్గం లో విద్య సంస్థలను నడిపిస్తున్న విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అలాంటి విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో దిలీప్, సాయి, కిషోర్, వికాస్ ,ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.