జిల్లాలో బెల్ట్ షాపులు గల్లి గల్లిన గ్రామ గ్రామాన మంచినీళ్ళ కుళాయిల లాగా వెలుస్తున్నాయని బెల్ట్ షాపుల నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బెల్ట్ షాపులలో కల్తీ మద్యం కలుపుతూ లాభాల కొరకు వ్యాపారాలు చేస్తూన్నారని అన్నారు. గ్రామాలలో వార్డులలో కొందరు రాజకీయ నాయకులకు లేదా గ్రామస్తులకు టెండర్లలో డబ్బులు ఇచ్చి గ్రామ అభివృద్ధి కమిటీ పేరు చెప్పి ఇలా లక్షలు, కోట్ల రూపాయలు సంపాదించే కొందరు మహారాష్ట్ర నుండి దేశి దారు తీసుకువచ్చి ఇందులో కలిపి చాలా గ్రామాల్లో అమ్మడం జరుగుతుందన్నారు. ఎక్సైజ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాసులకు కక్కుర్తి పడి ఇలా పేదవాళ్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొండల రాములు, అరుణ్ కుమార్, దళిత కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు రాందాస్, సీనియర్ నాయకులు షేక్ పాషా, బెజ్జంకి నర్సింగరావు ఉన్నారు.