నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: మూసి ప్రభావిత ప్రాంతాల మంత్రుల సన్నాహక సమావేశం మొన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించారు.నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం సమావేశానికి వెళుతుండగా అక్కడ పోలీస్ అధికారులు ఎమ్మెల్యేను గుర్తుపట్టకుండా సమావేశానికి పోకుండా అడ్డుకున్నారు. వేముల వీరేశం ప్రజా ప్రతినిధి ఎవరో ఎమ్మెల్యే అని చూడకుండా అడ్డుగించినందుకు పోలీస్ అధికారులపై విసుకుని అక్కడ నుంచి అలిగి వెళ్లిపోయారు.తోటి ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య కుంభం అనిల్ కుమార్ రెడ్డి సముదాయించిన వారి మాటలు వినా కుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. క దళిత ఎమ్మెల్యేను ఈ విధంగా పోలీసు ఉన్నతాధికారులు అవమానించిన అందుకు అవమానించినందుకు దళిత వర్గ సంఘాలు బగ్గుమంటున్నాయని ఎమ్మార్పీఎస్ యాదాద్రిభువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ సోమవారం ప్రకటనలో కోరారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఉన్నత అధికారులు రెడ్డి సామాజిక వర్గ నాయకుల చేతుల్లో నడుస్తున్నారని దళిత వర్గ నాయకులను అవమానిస్తున్నారని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ను బహిర్గతంగా క్షమాపణ కోరి దళిత వర్గ ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే ఎంపీలను గౌరవించాలని బోయ లింగస్వామి మాదిగ ప్రభుత్వాన్ని కోరారు