దేశాయి బీడీ కంపెనీ యజమాని బీడీ కార్మికులకు అక్రమంగా తక్కువ ఇస్తున్న 15 రూపాయల కూలి వేతనాన్ని పెంచి ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు శుక్రవారం డిమాండ్ చేసినారు పట్టణ కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సూర్య శివాజీ మాట్లాడుతు పట్టణంలో లో గల దేశాయి కంపెనీ యజమాని వేతన ఒప్పందం ప్రకారం 1000 బీడీలకు ₹249 రూపాయల 99 పైసలు ఇవ్వాల్సి ఉంది కానీ అక్రమంగా కార్మికుల వద్ద వెయ్యి బీడీలకు 15 పదిహేను రూపాయలు చొప్పున చట్టానికి దొరకకుండా కమిషన్ ధర్ల వద్ద వసూల్ బలవంతంగా చేస్తున్నారు మరియు వెయ్యి బీడీలకు సరిపడా తునిక కు ఇవ్వకుండా నాసిరకమైన ఆకును సరఫరా చేస్తున్నారు. కంపెనీ చేస్తున్న దోపిడీని అడ్డుపెట్టుకొని లేదా కంపెనీ ప్రోత్సహంతొ కొంతమంది కమిషన్ దారులు కార్మికుల వద్ద అక్రమంగా 1250 బీడీలు నుండి 2000 వరకు బలవంతంగా తీసుకుంటున్నారు. ఈ సమస్యల్ని పరిష్కరించాలని కంపెనీ యజమానానికి మా యూనియన్ తరపున డిమాండ్ నోటీసు ఇచ్చి 15 రోజులైoది అన్నారు. కార్మికుల నిరాక్షరాసతను అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని సూర్య శివాజీ ఆరోపించారు యజమాన్యం. నేటి వరకు యాజమాన్యం స్పందించకపోవడంతో ఈరోజు కంపెనీ వద్ద కార్మికులతో ఆందోళన కార్యక్రమం చేయటానికి యూనియన్ పిలుపునిస్తే కార్మికులు సెంటర్కు రావద్దని వస్తే ఆకూ తంబాకు బంద్ చేస్తామని పని ఇవ్వమని బెదిరించి కార్మికులు రాకుండా ఈరోజు జరిగే కార్యక్రమం జరగకుండా కంపెనీ యజమాన్యం పైశాచిక ఆనందాన్ని పొందిందే కానీ కార్మికులను అనీచివేస్తే ఉద్యమo ఉప్పెనల లేస్తుందన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ చేసే దోపిడిని అడ్డుకుంటామని అన్నారు. ఇప్పటికైనా కంపెనీ యజమాన్యం చర్చలకు పిలిసి తక్కువ ఈస్తున్న వేతనాలు సరిగ్గా ఇవ్వాలని వెయ్యి బీడీలుకు సరిపడ మంచి తునికి ఆకు ఇవ్వాలని కార్మికుల వద్ద అక్రమంగా తీసుకుంటున్న బీడీలను బంద్ చేయాలని లేనాట్లయితే కంపెనీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయవలసి వస్తుందని ఆపై జరిగే పరిణామలకు కంపెనీ యజమాన్యమే భాద్యత వాయించవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో యూనియన్ జిల్లా కార్యదర్శి జే పీ గంగాధర్ పాల్గొన్నారు.