ఐసీఐసీఐ బ్యాంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి..

Action should be taken against the ownership of ICICI Bank..నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
రైతు ఆత్మహత్యకు కారకులైన ఐసీఐసీఐ బ్యాంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ ఆదివారం ఒక ప్రకటనలో   డిమాండ్ చేశారు. బేల మండలం రేణిగూడ గ్రామానికి చెందిన జాదవ్ దేవ్ రావు తన భూమిని మడిగేజ్ చేసి ఐసీఐసీఐ బ్యాంక్ లో  3.40 లక్షలు అప్పు తీసుకోని క్రమంగా వాయిదాలు చెల్లిస్తున్నాడని పేర్కొన్నారు. ఒక్క వాయిదా ఆలస్యం కావడంతో బ్యాంకు అధికారుల వేధింపులకు పాల్పడ్డాడరని వేధింపులు తాళలేక  రైతు బ్యాంక్ కు వేల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డరని పేర్కొన్నారు. పురుగుల మందు తాగిన రైతును ఆస్పత్రికి చేర్చకుండా సిబ్బంది నిర్లక్ష్యం చేశారని వారి నిర్లక్ష్యం ఫలితంగా రైతు మరణించారన్నారు. రైతు మృతికి కారకులైన బ్యాంక్ అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని, బ్యాంక్ లో ఉన్న రుణం బేషరతుగా రద్దు చేయాలన్నారు. బ్యాంక్ నుండీ కుటుంబానికి కోఠి రూపాయల నష్టపరిహారం అందించాలని అదే బ్యాంక్ లో తన కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిశగా చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు.