నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
లైంగిక వేదింపులకు పాల్పడుతున్న ఆకతాయిపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీఏనంటూ అధికారులను టార్గెట్ చేసుకుని సీడీపీఓ కార్యాలయానికే కాకుండా..మెదక్, హుజూర్నగర్ ఐసీడీఎస్ పరిధిలోని మరికొంత మందిని వేధిస్తున్నాడని తెలిపారు. సూపర్వైజర్ల నెంబర్లు, బయోడేటాను సేకరించి ఈ చర్యలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి ఆకతాయి చర్య వల్ల బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే అతన్ని అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.