అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు చేపట్టాలి

Action should be taken against the person making inappropriate comments– పోలీస్ స్టేషన్ యందు పిర్యాదు చేసిన శ్రీనివాస్
నవతెలంగాణ – బెజ్జంకి
బీసీ జాతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పెద్దోళ్ల శ్రీనివాస్ కురుమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొమురవెళ్లి మండల పరిధిలోని గురువన్నపేట గ్రామంలో బీసీ కురుమ మైనర్ బాలిక లైంగిక దాడి ఘటనలో దుండగుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం జిల్లా కేంద్రంలో బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి సంబంధిత కార్యక్రమ మీడియా కవరేజ్ ను మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓసీ వర్గానికి చెందిన వ్యక్తి బీసీలను ఉద్దేశించి “అడుక్కునేవారు దానం చేసే వారిని విమర్శిస్తారా.. ఇదెక్కడి రాజకీయం రా బాబు”అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ యందు ఫిర్యాదు చేసినట్టు బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్ల శ్రీనివాస్ కురుమ తెలిపారు.