
భారత ప్రధాని నరేంద్ర మోడీ పై వాట్సప్ గ్రూపు ద్వారా తప్పుడు వీడియోలను ప్రచారం చేసిన కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామానికి చెందిన శ్రీరాముల సుమన్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ భీంగల్ మండల శాఖ ఆధ్వర్యంలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, అదనపు కలెక్టర్ అంకిత్ కు ఫిర్యాదు చేశారు. కోవిడ్ సమయంలో తీసుకున్న కోవిడ్ షీల్డ్ టికాల వలన ప్రజలకు ప్రమాదం ఉందని మన బషీరాబాద్ వాట్సప్ గ్రూపులలో తప్పుడు ప్రచారం భారత ప్రధాని నరేంద్ర మోడీ, భారతదేశ ప్రతిష్టను బంగారం కలిగిస్తున్న సుమన్ పై చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరారు. వినతి పత్రం అందించిన వారిలో పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి మల్కన్నగారి మోహన్, భీంగల్ మండల అధ్యక్షుడు మహిపాల్ నాయకులు నాగార్జున రెడ్డి, దయ ప్రవీణ్, ఆరే రవీందర్, తక్కువరి సాయి రెడ్డి తదితరులు ఉన్నారు.