జర్నలిస్టు శంకర్ పై దాడి చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలి

– ఐజేయూ జిల్లా కోశాధికారి కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
జర్నలిస్ట్ శంకర్ పై దాడిచేసిన దుండగులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి జిల్లా టియుడబ్ల్యూజె (ఐజేయు) కోశాధికారి చింతల కుమార్ యాదవ్,ప్రజా సంఘాల నాయకుడు అక్కల బాపు యాదవ్ లు ప్రభుత్వానికి విజ్ఞప్తి  చేశారు.శనివారం మండలంలోని కొయ్యుర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో  న్యూస్ లైన్ తెలంగాణం తెలుగు దినపత్రిక చీఫ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు శంకర్ పై దుండగులు చేసిన పైశాచిక దాడిని తీవ్రంగా ఖండించినట్లుగా తెలిపారు. జర్నలిస్టులపై దాడులు చేసిన దుండగులను ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనునిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి తమ కలంతో గలాన్ని వినిపిస్తుంటే వారిపై దాడులు చేయడం సమంజసం కాదని, పనికి మాలిన చర్య అని దుయ్యబట్టారు.ఆలాగే జర్నలిస్టులపై దాడులు కొనసాగితే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందన్నారు.