అక్రమ ఇంటి నంబర్లు కేటాయించిన వారిపై చర్యలు తీసుకోవాలి

– మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవి నరసింహ రెడ్డి
నవతెలంగాణ- ఆర్మూర్:
మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ అసైన్మెంట్ భూములకు ఎలాంటి దస్తావేజులు లేకుండా ఇంటి నంబర్లు అక్రమంగా కేటాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవి నరసింహ రెడ్డి అన్నారు. పట్టణ ఆర్డీవో కార్యాలయం ఎందు మంగళవారం కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అసైన్మెంట్ ఖాళీ స్థలాలకు అక్రమంగా సుమారుగా 200 ఇంటి నెంబర్లు కేటాయించి వందల కోట్ల రూపాయలు స్కాంకు పాల్పడ్డారని, పట్టణంలోని తాజ్ గార్డెన్ దగ్గర, మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ తిరుమల గార్డెన్ దగ్గర ఇలా 200 వరకు అక్రమంగా ఇంటి నెంబర్లు కేటాయించడం జరిగిందని, బీఆర్ఎస్ నాయకుల అండతో భూ అక్రమాలకు పాల్పడడం జరుగుతుందని, వెంటనే విచారణకు ఆదేశించి అక్రమ ఇంటి నెంబర్లు రద్దుచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పాలెపు రాజు, బిజెపి పట్టణ అధ్యక్షులు ధ్యా గ ఉదయ్, మందుల బాలు, దుగ్గి విజయ్ తదితరులు పాల్గొన్నారు.