– బాలానగర్ మైక్రోస్మాల్ ఇండిస్టీస్ అధ్యక్షులు అంబటి సునీల్ కుమార్
నవతెలంగాణ-బాలానగర్
కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని పారిశ్రామిక వాడలోని బాలానగర్ మైక్రోస్మాల్ ఇండిస్టీస్ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ప్రతి రోజు పరిశ్రమల అభివద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు నుంచి రాష్ట్ర మంత్రుల వరకు అందరితో కలిసి బాలానగర్ పరిశ్రమల అభివద్ధి కొరకు నిరంతరం కషి చేస్తున్నానని మైక్రోస్మాల్ ఇండిస్టీస్ అధ్యక్షులు అంబటి సునీల్ సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈమేరకు తనపై వస్తున్న అవాస్తవాలపై విచారించి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని అంబటి సునీల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత ఏడు సంవత్సరాల నుంచి బాలానగర్ మైక్రో ఇండిస్టీస్‌లో ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాజీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి, కమిటీ సభ్యులందరితో కలిసి ప్రతీ విషయంలో అందరి అభిప్రాయాల మేరకు బాలానగర్ మైక్రోస్మాల్ ఇండిస్టీస్ అభివద్ధి కొరకు కలిసికట్టుగా కషి చేశామన్నారు. ఏ విషయం ఎవరికి చెప్పకుండా తన సొంత నిర్ణయంతో ఎలాంటి పని చేయలేదని అంబటి సునీల్ తెలిపారు. కాగా తాను చేస్తున్న అభివద్ధిని చూసి కొందరు చూడలేక తనపై ఓర్వలేక గుడ్డ కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని, దానికి కమిటీలో ఉన్న మాజీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి ప్రోత్సహిం చడం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. కమిటీ సభ్యులను కాదని తాను ఎలాంటి సొంత నిర్ణయం తీసుకోలేదని, సభ్యులను వ్యతిరేకించి తాను సొంతంగా ఏంచేసినా కమిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం లేకుండా ఉన్నట్లయితే వాళ్ళు చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానే కానీ తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోనని అధ్యక్షులు సునీల్ అన్నారు. బాలానగర్ మైక్రో స్మాల్ ఇండిస్టీస్ పేరుతో కొన్ని యూట్యూబ్ ఛానల్లో, తన ఫోటోను సైతం చిత్రీకరించి తన పరువు ప్రతిష్టకు బంగం కలిగించే విధంగా అవమానిస్తున్నారని, చేతిలో ఒక యూట్యూబ్ ఛానల్‌ను అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్టు వార్తని రాస్తున్నారని తనపైన అబండాలు వేసిన యూట్యూబ్ ఛానల్ పై బాలానగర్ పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని బాలానగర్ మైక్రోస్మాల్ ఇండిస్టీస్ అధ్యక్షులు అంబటి సునీల్ సంబంధిత అధికారులను కోరారు.