ఎస్సై శ్రీనివాస్‌ మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి

Action should be taken against those responsible for the death of SS Srinivasనవతెలంగాణ-కొత్తగూడెం
ఆశ్వారావుపేట ఎస్‌ఐ శ్రీరాముల శ్రీనివాస్‌ మరణానికి కారణమైన పోలీసు శాఖ అధికారులు, ఇతరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆదివారం ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్‌ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్రం పోస్ట్‌ ఆఫీస్‌ సెంటర్‌లో గల డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం, శ్రీనివాస్‌ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. శ్రీనివాస్‌ కుటుం బానికి రూ.5 కోట్ల ఎక్స్గ్రేషియా, ఆయన సతీమణికి గ్రూప్‌ స్థాయి ఉద్యోగాన్ని ప్రకటించి, వారి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు బడికల పుష్పలత, ఉపాధ్యక్షురాలు గంధం కల్పన, అంబేద్కర్‌ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శివకుమార్‌, సింగరేణి ఎస్సీ, ఎస్టీ, ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ ఆంతోటి నాగేశ్వర రావు, చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూసపాటి శ్రీనివాస్‌ బీఎస్‌పీ రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ ఎర్ర కామేష్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు పాల్గొన్నారు.
హత్య కేసు, అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ఎస్‌ఐ శ్రీనివాసు మరణించడం బాధాకరమని, మరణానికి కారణమైన వారిపై హత్యకేసు, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సైంటిఫిక్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ నేషనల్‌ కో-ఆర్డినేటర్‌ చార్వాక డిమాండ్‌ చేశారు.
చర్ల : ఎస్సై శ్రీనివాస్‌ను కులం పేరుతో వేధిస్తూ, అగ్రవర్ణాల అహంకారం ప్రదర్శిస్తూ నిత్యం వేధింపులకు గురిచేసి, ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన సీఐని, నలుగురు కానిస్టేబుళ్లను ఉద్యోగం నుండి తొలగించాలని, ఎట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర నాయకులు తడికల లాలయ్య, జిల్లా వర్కింగ్‌ కమిటీ అధ్యక్షులు ఎడెల్లి గణపతి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం జాతీయ మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నాయకులు నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల గౌరవ అధ్యక్షులు మోతుకూరి ప్రభాకర్‌, మండల అధ్యక్షులు రుంజా రాజా, నాయకులు తోటమల్ల కృష్ణారావు, సుధాకర్‌, మోహన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : శ్రీనివాస్‌ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని జర్నలిస్ట్‌, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలియజేశారు. పూల మార్కెట్‌ సెంటర్‌, అంబేద్కర్‌ సెంటర్లలో శ్రీనివాసరావు ఫోటోకి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబానికి తగిన న్యాయం చేయాలని, అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, కార్మిక సంఘాల నాయకులు, దళిత సేవా సమితి సింగరేణి ఎస్టీ, ఎస్సీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఎమ్మార్పీఎస్‌ నాయకులు జర్నలిస్టులు పాల్గొన్నారు.