
ఈనెల 19 అర్ధరాత్రి రోజు బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేసి గాయపరిచిన కాంగ్రెస్ కార్యకర్త లపై చర్యలు తీసుకోవాలని మండల బీఆర్ఎస్ నాయకులు కోరారు. సోమవారం పట్టణ కేంద్రంలోని సుమంగళి చౌరస్తా వద్ద బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు నరసయ్య మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ నాయకులు భీంగల్ మండలంలో ఇసుక దళారులను ప్రోత్సహించడంతో రోజురోజుకు వారి ఆగడాల మితిమీరిపోతున్నాయని అడ్డుకున్న వారిపై దాడులు చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే ఈనెల 19న అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను అడ్డుకున్న బిఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేసి గాయపరచగా ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పటివరకు వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆగడాలు ప్రజలు గమనిస్తున్నారని వీరికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఇప్పటికైనా దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని లేకుంటే మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాలు టిఆర్ఎస్ నాయకులు ఆర్మూర్ మహేష్, చౌట్పల్లి రవి, కన్నె సురేందర్, సుర్జిల్, మరియు మండల బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.