పంట నష్టం చేసి, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..

Action should be taken against those who damaged crops and attacked.

– పోలిసులకు బాదితుల ఫిర్యాదు…

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని గౌరరం రెవెన్యూ పరిధిలోని 389 సర్వే నెంబర్ లో గత కొన్ని ఏళ్లుగా సాగు చేసుకుంటున్నా భూమి లో గ్రామానికి చెందిన కోందరు శనివారం వచ్చి పత్తి పంట ను నష్ట పరిచి, పశువులను తోలి,జెసిబి తో తివ్ర నష్టం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలిసులకు ఫిర్యాదు చేశారు.బాదితులు లౌడియ బుజ్జి లలిత, కేతావత్ మారు, లౌడియ బీజాన్ లు మాట్లాడుతూ గౌరరం గ్రామానికి చెందిన ఎం కిష్టయ్య, జి స్వామి, జల్లా అశోక్, ప్రశాంత్ తోపాటు మరికోందరు కలిసి వ్యక్తిగత కక్షలతోనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. గత 15, 20 ఏళ్ల నుండి ఈ భూమిలో సాగు చేసుకుంటున్నామని, కొందరు కావాలని లో వేసిన పంటను ధ్వంసం చేసి పశువులను తోలి దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవ్వరికి సంబంధించిన భూమి కాకున్నా కోందరు గ్రామస్తులు వచ్చి ఇలా వ్యవహరించడం సబబు కాదని ఏదైనా ఉంటే రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు చూసుకోవాల్సి ఉండగా వీరు జోక్యం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని పేర్కొన్నారు. వీరిపై చర్యలు తీసుకొని తమ న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు. అంతకుముందు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.