– తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-తలకొండపల్లి
మండల కేంద్రంలోని ఉన్న చెరువులపై ముదిరాజులకు హక్కు ఉంటుందని ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు బోల్ల యాదగిరి ముదిరాజ్ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రంగారెడ్డికి ముదిరాజ్ సంఘం నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువూరు మాట్లాడుతూ తలకొండపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న 153 సర్వే నెంబర్లు గల ఎర్రగుంట చెరువు శిఖం పొలాన్ని గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆక్రమించారని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ కోరారు. గత మూడు నెలల క్రితం చెరువుకు సంబంధించిన హద్దులను గుర్తించి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరడంతో హద్దులు గుర్తించడం జరిగిందని తెలిపారు. అయినా కబ్జాదారులు మరోసారి చెరువు శిఖం పొలాన్ని దున్నుతున్నారని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ ను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి నరసింహ, ఉపసర్పంచ్ అనిల్, గ్రామ కమిటీ అధ్యక్షుడు శేఖర్, ముదిరాజ్ యూత్ అధ్యక్షుడు నాగరాజు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.