తాడిచెట్లు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి..

నవతెలంగాణ-ధర్మసాగర్: అనుమతులు లేకుండా భూ యజమానులకు తెలవకుండా తాడిచెట్లను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా గీత కార్మికుల సంఘం కన్వీనర్ సారా వెంకటేష్ గౌడ్ డిమాండ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాకు జీవనాధారమైన తాడి చెట్లను తొలగించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి వివరాల ప్రకారం ధర్మసాగర్ శివారులోని 553/B సర్వే నంబర్లో తాడి చెట్లను కొందరు వ్యక్తులు జేసీబీతో తొలగించారని, ఈ తాడిచెట్లను తొలగించడానికి ఎక్సైజ్ శాఖ నుండి ఎలాంటి అనుమతులు తీలుకోలేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఆ చెట్లు నా భూమిలో నుండి అక్రమంగా తొలగించారని కొందరు రైతు ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ ఫలితం లేదని విమర్శించారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో, ఎక్సైజ్ వారికి పిర్యాదు చేశామని తెలిపారు. ఈ సంఘటనను గీత కార్మికులు, గీత కార్మిక సంఘాలు ఖండిస్తున్నాయని అన్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు,ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే దశలవారీగా ఉద్యమాలను చేపడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.