ఐబీఏ గార్డెన్ పై దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

Action should be taken against those who spread bad news about IBA garden– ఐబీఐ గార్డెన్ ఓనర్ ఇర్ఫాన్ బిన్ అలీ
నవతెలంగాణ – భగత్ నగర్ 
ఐబీఐ గార్డెన్ పై 2024 అక్టోబర్ 15 రోజున తెలంగాణ టుడే ఇంగ్లీష్ పేపర్లో ఐబీఏ గార్డెన్పై వార్త వచ్చినట్లుగా ఎడిట్ చేసి దానిని ఫేస్ బుక్, వాట్సప్ లో వైరల్ చేస్తున్న వారిపై పత్రికా యజమాన్యం చర్యలు తీసుకోవాలని గార్డెన్ ఓనర్ ఇర్ఫాన్ బిన్ అలీ అన్నారు. శుక్రవారం ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా  సమావేశంలో వారు మాట్లాడారు.  ఐబీఏ గార్డెన్ను అభాసుపాలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ ఫేక్ వార్తను వైరల్ చేస్తున్నారన్నారు. దీంతో ఐబీఏ గార్డెన్ ప్రజల్లో నమ్మకం కోల్పోయే పరిస్థితులు జరుగుతున్నాయని అన్నారు. వీటిని అరికట్టాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో గార్డెన్ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.