
ఇంటి నిర్మాణాన్ని ఆపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మండలంలోని నాంచారి మడూరు గ్రామ నికి చెందిన బండారి సునీల్ పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారసత్వంగా వచ్చిన మా భూమిలో ఇంటి నిర్మాణం చేపడుతుండగా మా పెద్దనాన్న అతని కుమారులు ఇంటి నిర్మాణాన్ని ఆపాలని అధికారులకు లేఖలు రాస్తూ పత్రిక విలేకరులకు తెలుపుతూ.. మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించారు. మా తాత అయిన బండారి సాయిలు కు ఐదుగురు కుమారులని వారిలో వెంకట మల్లు, యాకయ్య, ఎల్లయ్య, సోమయ్య, వీరస్వామి, వారసత్వంగా పెద్ద కుమారుడి వెంకట మల్లుకు ఇంటి పన్ను రసీదులు అతని పేరు మీదికి రావడంతో ఇప్పుడు మొత్తం నాదే అని అతని కుమారులైన బండారి గణేష్, బండారి శీను నా ఇంటి నిర్మాణాన్ని ఆపుతున్నాడని, నాకు ఇద్దరు ఆడపిల్లలు, నేను నా ఇంటి నిర్మాణం ఆపడంతో నాకు నిలువ నీడ లేకుండా భార్య పిల్లలు రోడ్డు మీద పడే అవకాశం ఉందని అధికారులు స్పందించి నా ఇంటి నిర్మాణాన్ని పునరుద్ధరించాలని ఆయన పత్రికల ద్వారా అధికారులను వేడుకున్నారు.