శిలాఫలకాలు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

నవతెలంగాణ-భిక్కనూర్
శిలాఫలకాలు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మండలంలోని మోటాట్ పల్లి గ్రామ సర్పంచ్ మోటాటి రాజేశ్వరి రాజిరెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆగస్టు 15వ తేదీ నాడు గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు శిలాఫలకాలు, ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని ఈ విషయాన్ని భిక్నూర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని జిల్లా అధికారులు స్పందించి ధ్వంసం చేసిన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. ఫిర్యాదు పై ఎస్సై సాయి కూమార్ ని వివరణ కోరగా శిలాఫలకాలను ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు అందిందని నిందితులను త్వరలోనే పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆటంకం కలిగజేసిన, అల్లర్లకు పాల్పడిన ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.