నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలో అనుమతులు లేకుండా పుట్ట గొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ పాఠశాలల పై వెంటనే చర్యలు తీసుకోవాలిని బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో శనివారం ఎంఈఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా టిఆర్ఎస్వి నియోజకవర్గం నాయకులు పోతు అనిల్ కుమార్ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాలలు నడిపిస్తు లక్షలలో ఫిజులు వాసులు చేస్తూ విద్యార్థులకు సరైన ఆట స్థలం, మౌలిక వసతులు కల్పించకుండా అధిక ఫిజులు వాసులు చేస్తూ తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న స్కూళ్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అనుభవం లేని కనీస విద్య అర్హతలు లేని వారిని ఉపాధ్యాయలు గా నియమించి విద్యకు బ్రష్టి పట్టిస్తున్నారు అని మండిపడ్డారు. వెంటనే ఫిజ్ బోర్డను ప్రతి పాఠశాలలొ ఏర్పాటు చేసేలా ప్రతి పాఠశాల సందర్శించి చర్యలు తీసుకోవాలిని, లేని పక్షంలో ధర్నా చెప్పాడుతామన్నారు. కార్యక్రమంలొ నాయకులు తుమ్మల దిలీప్. రాకేష్. సందీప్. ప్రమోద్. వేణు తో పాటు తదితరులు పాల్గొన్నారు.