రసమయి బాలకిషన్ పై చర్యలు తీసుకోవాలి

Action should be taken on Rasamai Balakishan– బాధితుడు కనకం కుమారస్వామి వినతి
– చట్టపరమైన చర్యలు చేపట్టాలని తహసిల్దారుకు పిర్యాదు
నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని  రేగులపల్లి గ్రామ శివారులో 400,401,402 సర్వే నంబర్ల యందు అధికార దుర్వినియోగంతో అప్పటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్నాడని పోరాటం చేస్తే అక్రమ కేసులు నమోదు చేయించి దుర్మార్గంగా వ్యవహరించాడని కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల ఫోరం చైర్మన్ కనకం కుమారస్వామి అగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలోని తహసిల్ యందు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణం చేపట్టాడని నిర్దారణవ్వడంతో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కనకం కుమార స్వామి తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డికి పిర్యాదు చేశారు.
ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు అందించాలి.. 
తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ప్రభుత్వం ప్రకటించిన ఇళ్ల స్థలాలను అందించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులు విజ్ఞప్తి చేశారు.బుధవారం మండల కేంద్రంలోని తహసిల్ యందు ఉద్యమకారుల ఫోరం అధ్వర్యంలో ఇళ్ల స్థలాలు అందించాలని తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రమందజేశారు.కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల పోరం చైర్మన్ కనకం కుమారస్వామి, మానకొండూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు శానగొండ శరత్,మండలాధ్యక్షుడు జేరిపోతుల మధు,తాటి పెళ్లి శంకర్,దేవునూరి అంకుష్ పాల్గొన్నారు.