శ్రీ రాఘవేంద్ర బి పిఈడి కళాశాలపై చర్యలు తీసుకోవాలి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్ర  బీపీఈడి  (ఆర్మూర్) కళాశాల అధిక ఫీజులు చేస్తున్న సందర్భంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ యూనివర్సిటీ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బి శివ మాట్లాడుతూ బీపీఈడి మొదటి సెమిస్టర్, మూడవ సెమిస్టర్  పరీక్ష రుసుంను 1600  వందలు ఉన్న ఫీజును 3500 పైగా దౌర్జన్యంగా పేద విద్యార్థుల దగ్గర వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. యూనివర్సిటీ ప్రకటించిన ఫీజు కంటే దాదాపు రెండు మూడు రెట్లు ఎక్కువ తీసుకుని పేద విద్యార్థుల, తల్లిదండ్రుల కష్టాన్ని రక్తాన్ని జలగల్లా పిడుస్తున్న శ్రీ రాఘవేంద్ర బీపిఈడి యాజమాన్యం ఆన్నారు. పరీక్ష ఫీజును ఇంత ఎందుకని ప్రశ్నించిన విద్యార్థుల పైన దౌర్జన్యం చేయటం, కాలేజీ రిసిప్ట్ ఇవ్వకుండా దొంగ దారిలో రఫ్ పేపర్ పైన ఫీజులు వేస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న శ్రీ రాఘవేంద్ర బిపిఈడి కళాశాల అఫిలియేషన్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల దగ్గర అక్రమంగా అదనంగా వసూలు చేసిన పరీక్ష ఫీజును వెంటనే తిరిగి ఇవ్వాలని లేకపోతే విద్యార్థులకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ,రిజిస్ట్రార్ లు అక్రమంగా పరీక్ష ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న శ్రీ రాఘవేంద్ర (ఆర్మూర్) బీపీఈడి కళాశాలపై   చర్యలు తీసుకొని కళాశాల అఫిలేషన్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.  యూనివర్సిటీ పరిధిలో బీఈడీ కళాశాలలో, బీపీఈడి కళాశాలలు చాలావరకు యూజీసీ నిబంధనలు, యూనివర్సిటీ నిబంధనలు పాటించకుండా కనీస వసతులు లేకుండా అక్రమంగా నడుపుతూ,పరీక్ష సమయంలో ఎగ్జామ్ ఫీజు పేరు మీద ఫీజు కంటే రెండు మూడు రెట్లు అధికంగా వసూలు చేసుకుంటూ పేద విద్యార్థుల రక్తాన్ని జలగల్లా పీడుస్తున్న  యూనివర్సిటీ అధికారులు కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుచేట న్నారు.ఇప్పటికైనా యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఈ అక్రమంగా  ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షులు సాయికుమార్,స్టేట్ ఎగ్జిక్యూటివ్ సబ్యులు మోహన్, ఉపాధ్యక్షులు అనిల్, నాయకులు నవీన్, సమీర్, లెనిన్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.