ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటాం

– సంతోష్‌ నగర్‌ ట్రాఫిక్‌ సీఐ నరసింహా నాయక్‌
నవతెలంగాణ – సంతోష్‌ నగర్‌
ఫుట్‌పాత్‌ ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంతోష్‌ నగర్‌ ట్రాఫిక్‌ సీఐ నరసింహా నాయక్‌ హెచ్చరించారు. సంతోష్‌ నగర్‌ డివిజన్‌ ఓవైసీ చౌరస్తా లక్కీ హౌటల్‌ నుండి వెంకటేశ్వర ఆలయ కమాన్‌, యాదగిరి థియేటర్‌ వరకు ఉన్న ఫుట్‌పాత్‌లను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఫుట్‌పాత్‌లను ఆక్రమించి, వ్యాపారాలు కొనసాగిస్తున్నారని, ఆ వ్యాపారస్థులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పాదచారులు, వాహనదారులకు ఇబ్బంది కలిగించే విధంగా ఫుట్‌పాత్‌, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. సీఐ వెంట సంతోష్‌ నగర్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐలు సత్యనారాయణ, వెంకటప్ప మొజిరం, ట్రాఫిక్‌ పోలీస్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.