అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం

 – నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడి
నవతెలంగాణ- కంటేశ్వర్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ సిటీ పోలీసు యాక్ట్ ప్రకారం నిషేధిత ఉత్తర్వులు జారీ చేశారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీ లకు మద్దతుగా ఎన్నికల సమయంలో కొందరు మద్యం దుకాణాల యజమానులు టోకెన్ విధానంలో పెద్ద ఎత్తున మద్యం అమ్ముతున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలా పెద్ద మొత్తంలో విక్రయాలు జరుపకూడదని ఒకవేళ జరిపినట్లయితే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్సైజ్శాఖ నియమ, నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.