ఇసుక క్వారీల్లో బాల కార్మికులుంటే చర్యలు తప్పవు

నవతెలంగాణ – మల్హర్ రావు
ఇసుక క్వారీల్లో బాల కార్మికులుంటే చర్యలు తప్పవని మల్లారం పంచాయతీ కార్యదర్శి చెలుకల రాజు యాదవ్ హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లాకలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని మల్లారం గ్రామపరిదిలోని దబ్బగట్టు ఇసుక క్వారీ డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. డంపింగ్ యార్డులో బాల కార్మికులు పనులు చేయరాదని, కార్మికులకు అవగాహన నిర్వహించారు. బాల కార్మికులతో పనులు నిర్వహిస్తే చర్యలతోపాటు, ఇసుక క్వారీని సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.