– వైద్యారోగ్యశాఖ కార్యదర్శికి మంత్రి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వైద్యారోగ్యశాఖలో బదిలీల్లో అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, కార్యదర్శి క్రిస్టీనా చొంగ్తూను ఆదేశించారు. అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మంత్రి సీరియస్ అయ్యారు. వెంటనే విజిలెన్స్ విచారణ చేప ట్టాలని కోరారు. అవకతవకలకు పాల్పడినట్టు విచారణలో తేలితే ఏ స్థాయిలో ఉన్న అధికారి అయిన సరే…వారిపై చర్యలు తీసుకో వాలని స్పష్టం చేశారు.