
ఇంటర్మీడియట్ పరీక్షలలో మాస్ కాపీయింగ్ తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టినట్లు పసర సీఐ వి శంకర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని ఎస్ఐ షేక్ మస్తాన్ తో కలిసి సీఐ శంకర్ పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా పరీక్ష జరుగుతున్న తీరు ను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ విద్యార్థులు ఎటువంటి మాస్ కాపీయింగ్ పాల్పడకుండా కట్టు దిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. అంతే కాకుండా పరీక్షలు ప్రశాంత వాతావరణం లో జరిగేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని అన్నారు. స్టూడెంట్స్ మన ధైర్యంతో పరీక్షలను ఎదుర్కొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.