– అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ -గండిపేట్
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పందెం వాగు, నాలా పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డైరెక్టర్ శ్రీనివా స్‌రెడ్డి అన్నారు. మంగళవారం మణికొండ మున్సిపాలిటీలోని తానిషానగర్, హుడా కాలనీ ప్రాంతాలలోని ఉన్న బహుళ అతస్తుల సముదాయా లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బహుళ అంతస్తులకు అనుమతి ఇవ్వడంతో ఇక్కడి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తాగునీటి వసతి, డ్రయినేజీ ఇతర సమస్యలను పరిష్కరిం చకుండా అధికారులు బహుళ అంతస్తులకు ఇస్తున్నట్టు స్థానికులు ఆరోపిం చారు. దీనికి డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ బహుళ అంతస్తుల నిర్మాణాల సముదాయం నుంచి ఎంప్లాయిస్ కాలనీ దగ్గర ఉన్న పందెం వాగు పరిర క్షణ కోసం కృషి చేయాలని అధికారులను ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, డీడీఈ జ్యోతి పబ్లిక్ హెల్త్ సూప ర్‌వైజర్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఆయా కాలనీల అధ్యక్షులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.